అంబరాన్నంటిన కైట్ ఫెస్టివల్ సంబురాలు!! ముఖ్య అతిథి గా సినీనటి మాధవిలత

 























వరంగల్ జిల్లా నర్సంపేట మండల పరిధిలో గ్రీన్ రిసార్ట్స్ వారు నిర్వహించిన కైట్ ఫెస్టివల్ కార్యక్రమం  అంబరాన్నంటింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా సినీనటి మాధవిలత ,సినీనటి గీతాసింగ్ ,సినీనటుడు రదండి సదయ్య (ఆర్. ఎస్. నంద) కార్యక్రమంను ప్రారంభించారు.అనంతరం చిన్న పిల్లలు రంగు రంగుల పతంగులను ఎగురవేసారు.మరియు తెలంగాణ పిండి వంటలు ఆరంభించారు. అనంతరం సినీనటి మాధవిలత మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణం లో, చుట్టూ పచ్చనిపోలాల మధ్య గ్రీన్ రిసార్ట్స్ నిర్మించడం చాలా అందముగా ఉందని,ఇటువంటి ప్రాంతం  పర్యాటకులకు అనువైన ప్రాంతం అని చెప్పారు. పాకాల సరస్సు సందర్శించే యాత్రికులకు పార్టీ లు చేసుకోవడానికి ఈ ప్రాంతం బాగా ఉంది అని కోనియాడారు. అనంతరం భోగి మంటలు వెలిగించి,స్విమ్మింగ్ ఫూల్ సందర్శించారు.అనంతరం ఫోటో షూట్ లో పాల్గొన్నారు.



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు