ఎవరూ అధైర్యపడవద్దు -మాజీ ఎమ్మెల్యే అరూరి....
గ్రేటర్ వరంగల్ 3 వ డివిజన్ పరిధిలోని బి అర్ ఎస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో వర్దన్నపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ హన్మకొండ హంటర్ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ డివిజన్ల అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని అన్నారు. ప్రజా తీర్పు ను గౌరవిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనీ సూచించారు. పార్టీ బలోపేతనికి కృషి చేస్తూ రాబోయే ఎన్నికల్లో బి అర్ ఎస్ పార్టీ జెండా ఎగిరెద్దామని అన్నారు కార్యకర్తకు ఎంటువంటి కష్టం వచ్చినా కాపాడుకుంట అని ఎవరు అదైర్య పడవద్దు అని మన నాయకులు కూడా కార్యకర్తలను అండగా నిలవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అద్యక్షులు రాజు, కార్పొరేటర్ షిభా - అనిల్,పాక్స్ ఛైర్మన్ హరి కృష్ణ,రైతు బందు కో ఆర్డినేటర్ శ్రీనివాస్,నాయకులు వెంకన్న, కోఠి, బిక్షపతి, మోహన్, కుమార్,సంజీవ, శ్రీను, గ్రామ శాఖ అద్యక్షులు రవీందర్ రెడ్డి,రాజు, రవీందర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి