దేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా మన హైదరాబాదు!!!
తెలంగాణ రాష్ద్ర రాజధాని హైదరాబాదు మహానగరం దేశం లో అత్యంత సురక్షితమైన నగరంగా గుర్తింపు సంపాదించుకుంది , దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో చాలా తక్కువగా నేరాలు నమోదవుతున్నట్టు జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్సీఆర్బీ) వెల్లడించింది. ఆ సంస్థ తాజాగా విడుదల చేసిన సురక్షిత నగరాల జాబితాలో మూడో స్థానంలో తెలంగాణ రాజధాని హైదరాబాదు నగరం నిలిచింది. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా, మహారాష్ట్ర రాజధాని పుణె నగరాలు మొదటి, రెండు స్థానాల్లో నిలిచాయి. ప్రతి లక్ష జనాభాకు జరుగుతున్న మహానగరాలలో జరుగుతున్స సగటు నేరాల సంఖ్య ఆధారంగా ఎన్సీఆర్బీ ఈ సురక్షిత నగరాల జాబితాను ప్రకటించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి