గృహ జ్యోతి పథకం పై శ్వేత పత్రం విడుదల చేయండి!!

 


గౌరవ తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్య మంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి విన్నవించునది ఏమనగా, 

👉మీరు ఆరు గ్యారంటీ లలో భాగమైన గృహ జ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యునిట్లు ఉచిత కరెంటు ఇస్తామని చెబుతున్నారు.. మరి తెలంగాణ రాష్ప్రంలో ప్రతి కుటుంబానికి 200యునిట్లుకు అయ్యే ఖర్చు ప్రభుత్వ ఖజానాలో ఉందా?? లేక ప్రభుత్వ ఖజానాలో డబ్బులు ఉన్నా మీరు లేదు అని చెబుతున్నారా??? దీనిపై తెలంగాణ ప్రజలందరికీ అర్థం అయ్యే  విధంగా శ్వేత పత్రం విడుదల చేయండి!! 

👉తెలంగాణ రాష్ట్రం లో ప్రతీ కుటుంబానికి 200 యూనిట్లు ఇవ్వడానికి విద్యుత్ సంస్థ లనుంచి కోనుగోలు చేయడానికి ప్రభుత్వం పై ఎన్ని లక్షల కోట్ల భారం పడబోతుంది ???దీనిపై తెలంగాణ ప్రజలందరికీ అర్థం అయ్యే  విధంగా శ్వేత పత్రం విడుదల చేయండి!! 

👉ప్రభుత్వం 200 యునిట్లు ఉచితంగా ఇస్తుంది అంటున్నారు సరే మరి ఆ ఉచితం ఇవ్వడానికి మీరు, మీ పార్టీ ఎమ్మెల్యే లు, ఎంపీలు మీకు ప్రజలు పన్నుల రూపంలో  చెల్లించే జీతాలనుంచి ఇస్తున్నారా???  లేక ప్రజల జేబులో నుంచి పన్నులు వసూల్ చేస్తూ ఇస్తున్నారా???? దీనిపై తెలంగాణ ప్రజలందరికీ అర్థం అయ్యే  విధంగా శ్వేత పత్రం విడుదల చేయండి!! 


👉తెలంగాణ ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూల్ చేసిన నిధులను  200యునిట్లు ఉచితం గా అని చెప్తున్నారు అంటే అది ఉచితం ఎలా అవుతుంది ముఖ్య మంత్రి గారు?? 

👉తెలంగాణ లో ఉన్న ప్రతీ కుటుంబానికి ఉచితంగా 200యునిట్లు విద్యుత్ ఇవ్వడం అంటే ప్రభుత్వ రంగ విద్యుత్ రంగ సంస్థ లను మరియు ఆ సంస్థ లో పని చేసే ఉద్యోగులను నష్టం చేసినట్టే !!!

👉ఫలితంగా ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ను నష్టం చేసి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ అదానీ కు అమ్మకానికి పెట్టడమే!! 

మరి ఎలక్షన్స్ లో మిమ్మల్ని గెలిపించింది ప్రభుత్వ సంస్థ లని ప్రైవేట్ వాడి కి అమ్మడానికా ముఖ్య మంత్రి గారు?? 

👉ప్రభుత్వ రంగ సంస్థ లని ప్రైవేట్ పరం చేయడం కంటే ఉన్న సంస్థ లని ఉపాధి అవకాశం కల్పన ఏర్పాటు చేసి బాగు పరచటం ఉత్తమ మార్గం!! ఈ సంగతి మీక్కూడా తెలుసు ముఖ్య మంత్రి గారు??? 

👉మీరు ఉచితం పేరు చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను అప్పుల కుప్పగా తయారు చేసే బదులుగా తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ లు, పీజీలు చేసి నిరుద్యోగం లో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగులను ఉపాధి అవకాశం అదే విద్యుత్ సంస్థ లో కల్పించి ప్రభుత్వ సంపదను పెంచండి !!

👉ముఖ్యంగా తెలంగాణ ముఖ్య మంత్రి గా బాధ్యత లు చేపట్టిన మరుక్షణం మీరు నిరుద్యోగం, బీదరికం వంటి  వాటిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి తెలంగాణ రాష్ట్రం లో ప్రజలను ఉచితాలు పేరు చెప్పి ప్రభుత్వ కార్యాలయం ముందు  వీధి బిచ్చగాళ్లు గా తయారు చేస్తున్నారు.. దీని వల్ల ప్రభుత్వం కు, ప్రభుత్వ ఖజానాకు ఓరిగిందేమిటి  ముఖ్య మంత్రి గారు??? 

👉బీదరికం ,నిరుద్యోగం నిర్మూలన  కావాలంటే సంపద స్రుష్టి జరగాలి, ఉద్యోగ కల్పన జరగాలి అప్పుడే ప్రభుత్వ ఖజానాలో డబ్బులు వస్తాయి... మరి ఈ సంగతి గౌరవ తెలంగాణ రాష్ట్రం రెండవ  ముఖ్య మంత్రి గారికి తెలియదా?? 

మరి బీదరికం పై, నిరుద్యోగం పై మీరు వెచ్చించిన ప్రభుత్వ ఆదాయం పై శ్వేత పత్రం ఎందుకు విడుదల చేయకూడదు ప్రియమైన తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్య మంత్రి గారు??? 


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు