రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన అరూరి

 







గ్రేటర్ వరంగల్ 45 వ డివిజన్ తరాలపల్లి గ్రామానికి చెందిన బిఅర్ఎస్ పార్టీ  డివిజన్ అద్యక్షుడు మెరుగు రమేష్ గారు గత రాత్రి రైలు ప్రమాదంలో మృతి చెందగా ఈరోజు తరాలపల్లి లోని వారి గృహానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్ గారు...


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెరుగు రమేష్ గారి మృతి వ్యక్తిగతంగా తనకు కలిచి వేసిందని డివిజన్ అద్యక్షులుగా వారు పార్టీ కోసం అహర్నిశలు శ్రమించేవారని వ్యక్తిగతంగా మరియు పార్టీ పరoగా వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేశారు...


వీరి వెంట డివిజన్ కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర రావు,పాక్స్ చైర్మన్ వనం రెడ్డి,రైతు బందు కో ఆర్డినేటర్ సంపత్ రెడ్డి,డివిజన్ అధ్యక్షులు రాజు,శ్రీధర్,కుమార్,రవీందర్,శ్రీకాంత్, మనింద్ర నాథ్, స్పందన్, వినోద్,నాయకులు రవీందర్,రమేష్,హరీష్, రంజిత్,క్రాంతి తదితరులు ఉన్నారు...

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు