శ్వేతపత్రం విడుదల చేయండి!!(ఆర్టీసి ప్రభుత్వ సంస్థ పైన )


 


గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి విన్నవించునది ఏమనగా ,


👉 "ఆర్టీసి బస్సుల్లో మహిలలకు ఉచిత ప్రయాణం"  పేరుతో మీరు పెట్టిన ప్రభుత్వ పథకం కు నిధులు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి తెలియజేసేలా "శ్వేతపత్రం విడుదల చేయండి !!"


👉 ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు అని ప్రజాపాలన లో మీరు చెప్పారు... మరి ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి సమకూరుతున్నాయో తెలుపుటకు తెలంగాణ ప్రజలందరికి తెలిసే విధంగా శ్వేతపత్రం విడుదల చేయండి!! 


👉పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన ప్రస్తుత తరుణంలో ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ ఆర్టీసి బస్సులు నడపడానికి అయ్యే ఖర్చు లు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారో తెలంగాణ ప్రజలందరికి తెలిసే విధంగా శ్వేతపత్రం విడుదల చేయండి!!


👉ఆర్టీసి బస్సుల్లో సగ భాగం సీట్లు మహిలలకు ఇంతకు ముందు ప్రభుత్వాలు కేటాయిస్తే ఆ సగం సీట్లు మీరు ఉచితం అని చెబుతున్నారు ..అలా అయితే ఆ ఉచితం ఎలా ఇస్తున్నారో ,ప్రతి ఆర్టీసి బస్సు ల్లో డబ్బులు చెల్లించి టిక్కెట్ ప్రయాణం చేసే ప్రయాణికులందరికీ తెలిసే విధంగా ప్రతి రోజు టిక్కెట్స్ ద్వారా సేకరించిన ఆదాయాన్ని బస్సు కండక్టర్ ద్వారా ఏరోజు కారోజు శ్వేతపత్రం ద్వారా తెలియపరచండి!! 


👉ఓక బస్సు నడపడానికి పెట్రోల్, డీజిల్ నుంచి మొదలు పెడితే ఆ బస్సును నడిపే డ్రైవర్ మరియు కండక్టర్స్ లకు అయ్యే ఖర్చు ఎంతో తెలపడానికి ప్రతి రోజు ప్రయాణికులకు మరియు ప్రజలందరికి తెలిసే విధముగా శ్వేత పత్రం విడుదల చేయండి !!

👉తెలంగాణ రాష్ట్రం ఆర్టీసి సంస్థ లాభాల బాటలో నడుస్తుందా లేక నష్టాల బాటలో నడుస్తుందా??? ఆర్టీసి సంస్థ ఆదాయం, ఆస్తులు, లాభ, నష్టాలపై ప్రయాణికులందరికి ముఖ్యంగా డిగ్రీ లు, పిజీ లు చేసి నిరుద్యోగం లో ఉన్న యువతకు తెలిసే విధంగా శ్వేత పత్రం విడుదల చేయండి !!

 

👉ఆర్టీసి సంస్థ లాభాల బాటలో కాకుండా నష్టాన్ని చవి చూస్తే భవిష్యత్తులో ఆర్టీసి ప్రైవేటీకరణకు మార్గం వేసిన మొట్ట మొదటి ముఖ్య మంత్రి గా చరిత్ర లో నిలిచి పోతారు.. !!

👉గత ప్రభుత్వం అతి కష్టం మీద నష్టాల బాటలో ఉన్న సంస్థ లో పనిచేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ చేసినది.. మరి మీరు ఉచితం పేరు చెప్పి మరింత నష్టం చేయడమే కాకుండా ఆ సంస్థ ను ప్రైవేట్ పరం చేయడానికి దారి లు తెరుస్తున్నారు.. ఇదెంత వరకు సబబు ముఖ్య మంత్రి గారు??? 

👉మరీ ముఖ్యంగా ఈ ఆర్టీసి బస్సు మనది మనందరిది ..అలాంటప్పుడు ఆ బస్సు లో కొందరికి ఉచితం పేరు చెప్పి బిచ్చం వేసి, కొందరి దగ్గర డబ్బులు వసూల్ చేసి ఆ వచ్చిన ఆదాయం తో ఆ బస్సును నడపడం ఎంత వరకు సబబు??? 

👉ఓకవేల ఆర్టీసి సంస్థ నిజంగానే లాభాల బాటలో పయనిస్తే ఆ వచ్చిన లాభాలతో నూతన ఆర్టీసి బస్సు కోనుగోల్లు , నూతనముగా  ఆస్తులు కోనుగోలు ప్రక్రియ చేయాలి మరియు నిరుద్యోగ రూపకల్పన కు అదే సంస్థ లో ఉద్యోగ కల్పన చేయాలి..మరి ఇలాంటి సాహసం ఎందుకు చేయకూడదు??? మరి దీనిపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయకూడదు  ప్రియమైన తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్య మంత్రి గారు ???



ప్రజా పాలన లో ఈ ప్రశ్నలపై గౌరవ తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్య మంత్రి గారు తెలంగాణ ప్రజానీకానికి శ్వేతపత్రం తో సమాధానం చెబుతారని ఆశిస్తున్నా!!! 


జై తెలంగాణ!!

✊✊✊✊✊

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు