ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరు మహాశయులకు కృతజ్ఞతలు... అరూరి రమేష్...


 





తెలంగాణ శాసన సభా ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ గెలువు కోసం మరియు నా గెలుపు కోసం రాత్రి పగలు కష్ట పడిన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రజా ప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, యువకులకు, వివిధ కులసంఘాల పెద్దలకు పేరు పేరునా ప్రతీ ఒక్కరికి బిఆర్ఎస్ పార్టీ వర్దన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేష్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వర్దన్నపేట నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరగడం, రాష్ట్రంలోనే అత్యధికంగా 80శాతం పైగా పోలింగ్ నమోదు కావడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. నిన్న జరిగిన పోలింగ్ సరళిని చుస్తే సుస్థిర పాలన అందించిన కేసీఆర్ గారి నాయకత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. ముఖ్యంగా వర్దన్నపేట ఓటరు మహాశయులు వర్దన్నపేట నియోజకవర్గ అభివృద్ధికి మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వమే రావాలి, మూడోసారి ఎమ్మెల్యే గా మా అరూరి రమేషే ఉండాలి అని సమయం వెచ్చించి ఓటు హక్కు వినియోంచుకున్న నియోజకవర్గ ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నన్ను ఆశీర్వదించిన నియోజకవర్గ ప్రజలకు, నా గెలుపు కోసం కృషి చేసిన పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు