ప్రజా పాలన అభయ హస్తం 6 గ్యారంటీల దరఖాస్తుల సమర్పణ పై ఆందోళన వద్దు: బల్దియా కమీషనర్ షేక్ రిజ్వాన్ భాషా

 



 ▪️డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు వారం రోజుల పాటు గ్రేటర్ వరంగల్ లోని 66 డివిజన్లలో దరఖాస్తుల స్వీకరించబడును. (డిసెంబర్ 31,జనవరి 1 సెలవు రోజులు మినహా)


 అభయహస్తం 6 గ్యారంటీల కొరకు 

కుటుంబం నుండి

ఒకే దరకాస్తూ మాత్రమే సమర్పించాలి.


 ▪️ప్రభుత్వ నిబంధనల ప్రకారం గడప గడప కు వెళ్లి దరఖాస్తు ఫారాల, అందజేత, స్వీకరణ ఉండదు. ఆయా డివిజన్లలో ఏర్పాటుచేసిన కౌంటర్లలో దరఖాస్తులు సమర్పించి, రసీదు పొందాలి.


▪️డివిజన్ లలో ఏర్పాటు చేసిన నిర్దేశిత కేంద్రాల్లో ఫారం స్వీకరిస్తాం. బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ తీసిన ఫారం  ద్వారా కుడా దరఖాస్తు చేసుకోవచ్చు.


▪️బల్దియా వ్యాప్తం గా ఉన్న 66 డివిజన్ లలోని ఏ కేంద్రం లోనైనా పూర్తి చేసిన దరఖాస్తులు సమర్పించవచ్చు


▪️రేషన్ కార్డు  ఉంటేనే దరఖాస్తు చేయాలి అనే నిబంధన  లేదు, ఆధార్ కార్డ్ జిరాక్స్ ద్వారా కూడా అప్లయ్ చేసుకోవచ్చు


▪️వదంతులు నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దు, అందజేసే ప్రతి దరఖాస్తు ను స్వీకరిస్తాం.


▪️దరఖాస్తుదారుల నుండి జిరాక్స్ కేంద్రాల యాజమాన్యాలు పెద్ద  మొత్తం లో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకొంటు కేసులు నమోదు చేస్తాం.


ఇట్లు..

కమిషనర్

గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు