ఓటర్ మహాశయా!! మేలుకో నీ ఓటు హక్కు ను వినియోగించుకో!!!

 


👉ఓటు వేయడం నీ హక్కు

👉ఓటు వేయడం నీ బాధ్యత

👉 ఓటు వేయడం అంటే నీ ఐదేల్ల *భవిష్యత్తు* కి పట్టం కట్టడం 

👉ఓటు వేయడం అంటే ఈ దేశ పౌరుడు ఐన నీ *అధికారం* ను కాపాడుకోవడం

👉ఓటు వేయడం అంటే నీ *స్వేచ్ఛ* ను  వినియోగించుకోవడం, నీకు నచ్చిన అభ్యర్థులకు నచ్చినట్చు వేయడం, ఎటువంటి ప్రలోభాలకు లోంగ కుండా!! 

👉ఓటు వేయడం అంటే నీ *భద్రత* ను ఇచ్చే ఈ రాష్ట్రం, దేశం లను రక్షించే పోలీస్, ఆర్మీ యంత్రాంగానికి ప్రోత్సహించటం 

👉ఓటు వేయడం అంటే  *ప్రశ్నించే అధికారం ను* పోందటం

👉ఓటు వేయడం అంటే నీ *అభివృద్ధి* ని ప్రోత్సహించటం !!

👉ఓటు వేయడం అంటే నీ *సంక్షేమం* ను ప్రోత్సహించటం

👉ఓటు వేయడం అంటే నీ *భావ ప్రకటన స్వేచ్ఛ* ను కాపాడటం 

👉ఓటు వేయడం అంటే *తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు* ను పోందటం 

👉ఓటు వేయటం అంటే నీ *జీవన ప్రమాణం* మరింత మెరుగు పరచటం

👉ఓటు వేయటం అంటే నీ *ఆర్థిక పురోగతి/ఆర్థిక అభివృద్ధి* కి పట్టం కట్టడం 


500రూపాయలకో ,బీరు బిర్యానీలకో అమ్ముడు పోయి మీ ఐదేల్ల పాలన ను ఎవరికో వేసి మీ ఓటు ను నాశనం చేసుకోవద్దు!!! 

👉 *పార్టీ చూసి ఓటేస్తే* ఇంతకు ముందు నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ మీకు ఏం చేసింది అని చూసుకుని ఓటు వేయండి 

👉 *అభ్యర్థి ని చూసి ఓటు* వేస్తే ఇంతకు ముందు నుంచి ఇప్పటి వరకు అభ్యర్థి ఏం చేసాడు (అభివృద్ధి, సంక్షేమము ),ఎలాంటి వాడు, మన సమస్య లు అర్ధం చేసుకుంటాడా లేదా అనేది చూసి ఓటు వేయండి 

👉 *అభివృద్ధి ,సంక్షేమము* చూసి ఓటు వేయాలనుకుంటే ఇంతకు ముందు నుంచి ఇప్పటి వరకు మీరు ఏ అభివృద్ధి, సంక్షేమము పోందారో చూసుకుని ఓటు వేయండి 

👉 *మతాన్ని చూసి ఓటు వేయాలనుకుంటే* ఇంతకుముందు నుండి ఇప్పటివరకు మీ మతానికి ఏం జరిగింది చూసి ఓటు వేయండి 

👉 *కులాన్ని చూసి ఓటు వేయాలను కుంటే* ఇంతకు ముందు నుంచి ఇప్పటి వరకు మీ కులానికి ఏం జరిగింది చూసి ఓటు వేయండి 


👉 *ప్రాంతం ను చూసి ఓటు వేయాలనుకుంటే* ఇంతకు ముందు నుంచి ఇప్పటి వరకు మీ ప్రాంతం లో ఏమి అభివృద్ధి జరిగింది చూసి ఓటు వేయగలరు 


*ఓటు హక్కు వినియోగించుకోండి, భావి భారత అభివృద్ధి కి సహకరించండి!!*


*మీ ఓటు మీ భాద్యత, మీ హక్కు, మీ భవిష్యత్తు ,మీ అభివృద్ధి , మీ స్వేచ్ఛ,మీ అధికారం !!*

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు