సమగ్ర అభివృద్ధి బిఆర్ఎస్ తోనే సాధ్యం..
సమగ్ర అభివృద్ధి బిఆర్ఎస్ తోనే సాధ్యం....
కారు గుర్తుకు ఓటు వేసి... కావాల్సినంత అభివృద్ధి చేసుకుందాం....
55,56డివిజన్ల పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అరూరి....
ఘన స్వాగతం పలికిన ప్రజలు, పార్టీ శ్రేణులు....
వర్దన్నపేట నియోజకవర్గం గ్రేటర్ వరంగల్ 55, 56 డివిజన్ల పరిధిలోని గోపాల్ పూర్, జవహర్ నగర్, పురిగుట్ట, కోమటిపల్లితో పాటు పలు కాలనీలలో బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేష్ గారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 55,56 డివిజన్లలో ఇప్పటివరకు 160కోట్ల పైచిలుకు నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్బంగా పార్టీ శ్రేణులు, మహిళలు, ప్రజలు ఎమ్మెల్యే గారికి డప్పు చెప్పుళ్లు, కోలాటాలు, బతుకమ్మలు, మంగళ హరతులతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు మాట్లాడుతూ
బిఆర్‌ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ కు లేదనీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చెప్పే వారంటీ లేని గ్యారెంటీ కార్డును ప్రజలు నమ్మవద్దని తెలిపారు. గతంలో ఎన్నో ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ హయాంలో మంచినీరు, కరెంటు, మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించలేకపోయిందో ఒకసారి ప్రజలు ఆలోచించాలని అన్నారు. ఆచరణకు సాధ్యం కానీ హామీల పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పాలని తెలిపారు. బాధ్యతాయుతమైన బిఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టోతోనే ప్రజలకు భరోసా అన్నారు. మన సమస్యలు మనమైతేనే పరిష్కరించుకోగలుగుతాం, మన కారు గుర్తుకు ఓటేసి మన సారును గెలిపించుకొని మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు. తనను మరోసారి ఎమ్మెల్యేగా ఆదరిస్తే ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి కెసిఆర్, కేటీఆర్ ల సహకారంతో వర్దన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్లు సిరంగి సునీల్,జక్కుల రజిత - శ్రీనివాస్, డివిజన్ అద్యక్షులు మణింద్ర నాథ్, రవీందర్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి