కాంగ్రెస్ పార్టీని వదిలి గులాబీ కండువా కప్పుకున్న నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్ము రమేష్
పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే అరూరి రమేష్
వర్ధన్నపేటలో కాంగ్రెస్ పార్టీకి గట్టిదెబ్బ తగిలింది. గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారిని పక్కన పెట్టి కొత్తగా వస్తున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నా వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి *కేఅర్ నాగరాజు* వ్యవహార శైలిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాడు నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు మరియు నాగరాజు వ్యక్తిగత అనుచరుడు *కొమ్ము రమేష్* మరియు పర్వతగిరి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మూడు దేవరజ్ గులాబీ గూటికి చేరారు. బీఅర్ఎస్ పార్టీ మేనిఫెస్టో కు ఆకర్షితుడై, స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పని తీరు నచ్చి తాను బీఅర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. రానున్న రెండు మూడు రోజుల్లో యూత్ కాంగ్రెస్ నుండి బీఅర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు ఉంటాయని అన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి