వర్ధన్నపేట లో ఖాళీ అవుతున్న బిఎస్పీ
*బిఎస్పీ గుర్తుకు గుడ్ బై చెప్పినా బిఎస్పీ పార్టీ వర్ధన్నపేట మండల పార్టీ అధ్యక్షుడు సంకినేని మధు*
*కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బి అర్ ఎస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి అరూరి రమేష్ గారు...*
*వర్ధన్నపేట మండల బిఎస్పీ పార్టీ వర్ధన్నపేట మండల పార్టీ అధ్యక్షుడు సంకినేని మధు* ఈరోజు హంటర్ రోడ్ క్యాంప్ కార్యాలయంలో 100 మందితో బిఅర్ఎస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ అభ్యర్ధి అరూరి రమేష్ గారి సమక్షంలో బిఎస్పీ పార్టీకి రాజీనామా చేసి బిఅర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది...వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది..*
ఈ సందర్భంగా వారు మాట్లడుతూ దేశంలో ఎక్కడ లేనివిధంగా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు కావడంతో ప్రజలు రాజకీయాలకు అతీతంగా టిఆర్ఎస్ పార్టీని విశ్వసిస్తున్నారని తెలంగాణ ప్రజలు అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నారని సంక్షేమ విషయంలో అధినేత కెసిఆర్ గారు రాజిపడే ప్రసక్తి లేదని పార్టీ కోసం నిజాయితీగా కష్టపడే వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు... కాంగ్రెస్ అబద్ధపు హామీలు నమ్మి ప్రజలు మోసపోవద్దని అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, కొత్త మొహాలు నియోజక వర్గంలో డబ్బుల సంచులతో అంగట్లో పశువులను కొన్నటు కొంటున్నారు, నియోజకవర్గ ప్రజలు గమనించాలని 20 రోజులు దాటితే కనీసం నియోజకర్గo వైపు కన్నెత్తి కూడా చూడరని, 10 సంవత్సరాల నుండి అహర్నిశలు నియోజకవర్గ అభివృద్ధికి కష్టపడుతూ కష్టనష్టాల్లో నియోజకవర్గానికి తోడుగా ఉంటూనాని అన్నారు...నియోజకవర్గం మనకు శ్రీరామరక్ష అని బిఆర్ఎస్ పార్టీ నాకు మూడోసారి అవకాశం ఇచ్చినందున మీరందరూ నన్ను ఆశీర్వదించి మరొకసారి కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అన్నారు...
పార్టీలో చేరిన వారిలో...
👉 తాటికాయ కృష్ణ, తూళ్ల అశోక్, తాటికాయల లక్ష్మణ్, మల్లపాక రాజేష్, మంద వంశీ, సాతు పెళ్లి రాజ్ కుమార్, సత్తుపల్లి మహేష్, మంద ప్రశాంత్ పలువురు పార్టీలో చేరడం జరిగింది....
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు సూరారం నిరంజన్, ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు....
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి