బిఅర్ఎస్ పార్టీలోకి చేరికలు

 









గ్రేటర్ వరంగల్ 65 వ డివిజన్ చింతగట్టు,మునిపల్లి గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నుండి సుమారు 500 మందికి పైగా యువకులు, మహిళలు ఈరోజు చింతగట్టు లో వర్ధన్నపేట బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు అరూరి రమేష్ గారి సమక్షంలో బి అర్ ఎస్ పార్టీలో చేరడం జరిగింది..వీరందరికీ అరూరి రమేష్ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది...


ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కేసిఆర్ గారి 2023 మానిఫెస్టో కి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అభివృధ్ది చేసిన బిఅర్ఎస్ పార్టీ ప్రజలు ఆదరిస్తారని పార్టీలో చేరిన వారిని సముచిత స్థానం ఇచ్చి వారిని కాపాడుకుంటమాని అన్నారు...

పార్టీలో చేరిన వారిలో కాయిత రఘువీరారెడ్డి,చింత రాజు,తంగెలపెళ్లి కోటి,ఎరుకొండ అనిల్,ముంజ శ్రీకాంత్,సాయికుమార్,మంజూల,అరుణ,శ్రీలక్ష్మి,రజిని,ఇందిరా,సంధ్యారాణి,రమేష్,సుధాకర్, వీరితో పాటు పలువురు పార్టీలో చేరడం జరిగింది..


ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు రుణ విమోచన చైర్మన్ నాగుర్ల వెంకన్న,రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ లలితా యాదవ్,స్థానిక కార్పొరేటర్ గుగులోతు దివ్య రాజు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు