సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నుండి బిఅర్ఎస్ పార్టీ భారీగా లో చేరికలు
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బి అర్ ఎస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ అభ్యర్ధి అరూరి రమేష్ గారు...
కేసిఆర్ గారి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ SR నగర్ చెందిన 50 మoదికి పైగా వర్ధన్నపేట నియోజకవర్గ బిఅర్ఎస్ పార్టీ అభ్యర్ధి అరూరి రమేష్ గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది..
ఈ సందర్భంగా వారు మాట్లడుతూ దేశంలో ఎక్కడ లేనివిధంగా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు కావడంతో ప్రజలు రాజకీయాలకు అతీతంగా బిఆర్ఎస్ పార్టీని విశ్వసిస్తున్నారని తెలంగాణ ప్రజలు అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నారని సంక్షేమ విషయంలో అధినేత కెసిఆర్ గారు రాజిపడే ప్రసక్తి లేదని పార్టీ కోసం నిజాయితీగా కష్టపడే వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు... కాంగ్రెస్ అబద్ధపు హామీలు నమ్మి ప్రజలు మోసపోవద్దని అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కేసిఆర్ గారు రైతులకు రైతుబంధు రైతు బీమా 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తూ రైతులను అక్కున చేర్చుకుంటున్నారని ఆయన అన్నారు.. నియోజకవర్గం మనకు శ్రీరామరక్ష అని బిఆర్ఎస్ పార్టీ నాకు మూడోసారి అవకాశం ఇచ్చినందున మీరందరూ నన్ను ఆశీర్వదించి మరొకసారి కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అన్నారు...
పార్టీలో చేరిన వారిలో sk ఆఫీజ్,
MD శంషాద్దీన్, M, రమేష్, రబ్బాని, కదిర్ కాజా పాషా, షబ్బీర్, బాబురావు,లింగమూర్తి తదితరులు పార్టీలో చేరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో 14 వ డివిజన్ ప్రెసిడెంట్ M. నరసింహ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు....
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి