వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేశాను.
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నాను...
ఎన్నికల్లో రాగానే నియోజకవర్గం లో కొత్త మొహాలతో కొందరు తిరుగుతున్నారు...
పగటి వేషాలతో ఓట్ల కోసం చెప్పే మాయమాటలు నమ్మవద్దు....!!!
ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రేటర్ వరంగల్ 1 & 2 మరియు 55 వ డివిజన్ల పరిధిలోని గుండ్ల సింగారం, పెగడపల్లి, ముచెర్ల ,పలి వేల్పుల, ఏర్రగట్టు గుట్ట కాలనీలు మరియు భీమారం గ్రామాల్లో బి అర్ ఎస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ అభ్యర్ధి అరూరి రమేష్ గారు ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు...
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు మహిళలు ప్రజలు డబ్బు చప్పులతో కోలాటాలు బతుకమ్మలు మంగళహారతులతో రమేష్ గారికి ఘన స్వాగతం పలికారు...
ఈ సందర్భంగా అరూరి రమేష్ గారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఆపదలో ఓదారుస్తూ వారికి కంటికి రెప్పలా కాపాడుకునేది నేనని వర్ధన్నపేటను అన్ని రంగాల్లో 4354 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చానని తెలిపారు. ఒకప్పటి వర్దన్నపేట ఎలా ఉన్నది.... ఇప్పుడున్న వర్ధన్నపేట నియోజకవర్గం ఎలా ఉందో ఒకసారి ప్రజలందరూ గమనించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్నాని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు అన్నివేళలా దగ్గరుండి సేవ చేస్తున్నానని అన్నారు... వర్ధన్నపేటలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న వ్యక్తికి హఠాత్తుగా ఎన్నికలు అనగానే నియోజకవర్గం గుర్తుకొచ్చిందని, నియోజకవర్గంలో తాను పుట్టానని, పెరిగానని చెబుతున్న ఆయనకు మరి ఇన్ని రోజులు ప్రభుత్వ అధికారిగా ఉన్నప్పుడు సొంత నియోజకవర్గం ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ఉన్నత పదవిలో ఉండి ఏ ఒక్కరోజు కూడా నియోజకవర్గాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. అలాంటి వ్యక్తిని ఎన్నికల ముందు వచ్చి నేను మీ వాన్ని అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. పదవి మీద యావ తప్ప ప్రజల మీద ప్రేమ లేని కాంగ్రెస్ అభ్యర్థిని వర్దన్నపేట ప్రజలు ఆదరించరని అన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, కుడా ఛైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, జిల్లా రైతు బందు సమితి అధ్యక్షురాలు లలితా యాదవ్, రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, కార్పొరేటర్లు రవి నాయక్,రజిత - శ్రీను,డివిజన్ అధ్యక్షులు శ్రీధర్, కుమార్, రవీందర్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి