మాట తప్పేది లేదు...మడమ తిప్పేది లేదు..అభివృద్ధిలో రాజిపడను.. - అరూరి రమేష్
వర్ధన్నపేట మండలం చెన్నారం, కషాహగూడెం, కడారిగూడెం, రామోజి కుమ్మరి గూడెం, రాందాన్ తండా, చంద్రు తండా, నల్లబెల్లి మరియు ఉప్పరపల్లి గ్రామలలో ఎన్నికల ప్రచారంలో బి అర్ ఎస్ పార్టీ వర్ధన్నపేట ఎమ్మెల్యే అభ్యర్ధి అరూరి రమేష్ గారు పాల్గొన్నారు...
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మహిళలు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున డబ్బులతో కోలాటాలతో పూలమాలలతో ఆరూరి రమేష్ గారికి ఘన స్వాగతం పలికారు...
ఈ సందర్భంగా అరూరి రమేష్ గారు మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గ అభివృధ్ది విషయంలో తాను వెనుకడుగు వేసేది లేదని అన్నారు..
తాను ఎమ్మెల్యేగా గెలవమందు వర్ధన్నపేట ఎలా ఉందో ఎమ్మెల్యేగా గెలిచినాక ఎలా ఉందో ప్రజల గమనించాలని కోరారు ఒకనాడు నియోజకవర్గంలో గుంతలు రోడ్లు నేర్రలు బారిన భూములు సాగు తాగునీరు లేక ప్రజలు మైళ్ళకొద్దీ మంచినీటి కోసం బిందెను తలపై పెట్టుకుని వెళ్లిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి కానీ ఎమ్మెల్యేగా గెలిచినాక 2014 నుండి ఇప్పటివరకు 10 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో 4354 కోట్లతో పలు అభివృద్ధి & సంక్షేమ పనులు పూర్తి చేయడం జరిగిందని గ్రామాల్లో సిసి రోడ్లు పాఠశాల భవనాలు గ్రామపంచాయతీ బిల్డింగులు మహిళా భవనాలు, కుల సంఘాలు భవనాలు,ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఏర్పాటు చేసుకున్నమానీ అన్నారు.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ సహకారంతో తాను వర్ధన్నపేట ప్రజల ఆశీర్వాదంతో గెలిచి నియోజకవర్గానికి సేవ చేసే భాగ్యం లభించింది అన్నారు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి ప్రజలు గెలిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో ఎంతో అధ్బుతంగా ఉందని ఆసరా పెన్షన్లు రైతుబంధు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్టు లాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన లాగానే మరిన్ని పథకాలు కేసిఆర్ గారి నాయకత్వములో ప్రవేశ పెట్టకునీ తెలంగాణ రాష్ట్రాన్ని నియోజవరర్గాన్ని మరింత అభివృద్ధి చేస్కుకుందామని అన్నారు. ఎన్నికల్లో మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయగానే ఆసరా పింఛన్ల పెంపకం, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు.. ఎన్నికలవేళ కొత్త మోకాలు నియోజకవర్గంలో తిరుగుతున్నాయని 20 రోజులు మాత్రమే వాళ్ళు నియోజకవర్గంలో ఉంటారని ఎన్నికలు అయిపోయాక కనీసం ఇటు చూసేనాధుడు కూడా ఉండడని..ఈ పది సంవత్సరాల కాలంలో నియోజక అభివృద్ధికై అహర్నిశలు కష్టపడుతున్నానీ కేసిఆర్ గారి ఆశీర్వాదంతో మరొకసారి మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించారని నియోజకర్గ ప్రజానీకం పెద్ద ఎత్తున ఆశీర్వదించాలని అన్నారు...
ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు,జిల్లా రైతు బందు అధ్యక్షురాలు లలితా యాదవ్,జిల్లా ఆత్మ చైర్మన్ గోపాల్ రావు,ఎంపిపి అప్పారావు,జెడ్పీటీసీ బిక్షపతి,పాక్స్ చైర్మన్ రాజేశ్ కన్నా,మార్కెట్ చైర్మన్ స్వామీ రాయుడు,మండల పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి,సర్పంచులు,ఎంపిటిసి లు,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు....
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి