మీ బిడ్డగా పదేళ్లు మీతో ఉన్నా.
కాంగ్రెస్స్ మాటలు నమ్మి మోసపోవద్దు
వాడుకొని వదిలేసే కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ కార్యకర్తలే సరైన సమయంలో తరిమికొడతారు...
పెద్ద అధికారి హోదాలో పనిచేసి అందరితో సార్ అని పిలిపించుకుంటున్నాడు...
అన్నా అంటే మీ వెంటే ఉంటూ వస్తున్న నాపై నమ్మకం ఉంచండి...
నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది..
బిజెపికి డిపాజిట్ కూడా రాదు..
ఆ పార్టీ నాయకులు వాళ్లకు ఓటు వేసే పరిస్థితి లేదు
కెసిఆర్ సంక్షేమ పథకాలే తెలంగాణ ప్రజలకు రక్ష
ఐనవోలు మండలం నర్సింహుల గూడెం, ముల్కలగూడెం, కొండపర్తి, వనమాల కనపర్తి,ఉడుత గూడెం, లింగ మొర్రి గూడెం, రాం నగర్ మరియు ఒంటిమామిడిపల్లి గ్రామాల్లో టిఆర్ఎస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేష్ గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు..*
ఈ సందర్భంగా ఆరూరి రమేష్ గారికి స్థానిక నాయకులు కార్యకర్తలు డప్పు చప్పుళ్లతో, కొలాటాలతో,బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు...
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
వర్ధన్నపేట నియోజకవర్గoలో పదేళ్లపాటు మీలో కుటుంబ సభ్యుడిగా ఉండి మీ కష్ట సుఖాలలో అండగా ఉన్నానని,ఇప్పుడు కొత్తగా సంక్రాంతి పండుగకు ఇంటి ముందుకు గంగిరెద్దులు వచ్చినట్టు వివిధ పార్టీల నాయకులు తమ ఇష్టానుసారంగా మాట్లాడుతూ వచ్చి మాయమాటలు చెబితే నమ్మవద్దని తెలిపారు..
👉 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగరాజును నమ్మితే నట్టేట ముంచుతాడని ఆ పార్టీలో ఉన్న నాయకులకు కార్యకర్తలకే ఇప్పటివరకు నాగరాజు తో కలివిడిగా మాట్లాడేంత సమయం దొరకడం లేదని రేపు గద్దెనెక్కిన తర్వాత సొంత పార్టీ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు
👉 మాజీ పోలీసు అధికారిగా పెద్ద హోదాలో పనిచేసి నేడు అందరితో సార్ అని పిలిపించుకుంటున్నాడు తప్ప ప్రజలను తన సొంత మనసులుగా చూసే పరిస్థితి లేదనే విషయాన్ని గమనించాలన్నారు వంగి వంగి నమస్కారాలు పెడుతూ ప్రజలను వంచించడానికి వస్తున్న ఇతర పార్టీ నాయకులను గ్రామాల్లో తరలికొట్టాలని సూచించారు..
👉 సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి నియోజకవర్గానికి తెచ్చిన నిధులు ఇతర కార్యక్రమాలు ప్రజలకు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉండి నోట్లో నాలుకల నేను నిలిచాను..
👉 ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఎత్తులు వేసినా చివరికి వర్ధన్నపేటలో గులాబీ జెండా అనే ఎగురుతుందని దీమా వ్యక్తం చేశారు..
👉 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ చేయని అభివృద్ధి పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ చేసిందని సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా తెలంగాణ ప్రజలకు ఏం కావాలో తెలుసని తెలిపారు..
👉 తెలంగాణ స్టీరింగ్ ఢిల్లీ చేతిలో పెడితే మళ్లీ గల్లీలో పోరాటాలు చేయక తప్పదు..
👉బిజెపి కేంద్రంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయలు తీసుకొని తెలంగాణ ప్రజలకు ఆశించిన స్థాయిలో పదేళ్లలో ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలన్నారు..
👉 డబల్ ఇంజన్ సర్కార్ పేరిట కేంద్రంలో రాష్ట్రంలో దోచుకోవడానికే కార్పొరేట్ సంస్థలకు రాష్ట్రాన్ని అప్పగించడానికి బిజెపి ప్రయత్నిస్తోందని తెలిపారు.
మన సమస్యలు మనమైతెనే పరిష్కరించుగోగలుగుతాం మన కారు గుర్తుకు ఓటేసి మన సార్ ని గెలిపించుకొని మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు...తనను మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే కెసిఆర్ కేటీఆర్ ల సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని అన్నారు...
ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నెని రవీందర్ రావు, జెడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల శ్రీరాములు,మార్నెని ఎంపిపి మధుమతి,మండల పార్టీ అధ్యక్షుడు శంకర్ రెడ్డి, వైస్ ఎంపిపి మోహన్,రైతు బందు అద్యక్షులు సమ్మయ్య, టెంపుల్ ఛైర్మన్ జై పాల్ యాదవ్,నందనం సొసైటీ వైస్ చైర్మన్ చందర్ రావు,దర్గా సొసైటీ వైస్ చైర్మన్ బాబు,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రాజ శేఖర్,వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపిటిసిలు,గ్రామ శాఖ అద్యక్షుడు కార్యదర్శులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి