వర్దన్నపేట నియోజకవర్గ ముదిరాజ్ ల మద్దతు అరూరికే..

 









వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని ముదిరాజ్ కులస్తుల పూర్తి మద్దతు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేష్ గారికే నని, అరూరి రమేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి ముదిరాజ్ కులస్తులు ముందువరుసలో ఉంటారని తెలిపారు. ఈ సందర్బంగా వర్దన్నపేట నియోజకవర్గ ముదిరాజ్, మత్స్య కార్మికుల సంఘం ఆధ్యర్యంలో ఏర్పాటు చేసుకున్న సమావేశానికి ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు హాజరై బిఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ గారు ముదిరాజ్ కులస్తులకు పెద్ద పీట వేశారని తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మారమ్మత్తు చేసి ఉచితంగా చేప పిల్లలు పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. మత్స్య కార్మికులకు వాహనాలు సైతం అందించారాని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే ముదిరాజ్ ల ఆత్మగౌరవం పెరిగిందని అన్నారు. మున్ముందు మరింత అభివృద్ధి సాధించేందుకు బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.


ఈ కార్యక్రమంలో డీసిసిబి చైర్మన్ మార్నెని రవీందర్ రావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గజ్జెల శ్రీరాములు, మత్స్య కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చొప్పరి సోమయ్య,జిల్లా అధికార ప్రతినిధి ఉదయ్ కిరణ్,ముదిరాజ్ ప్రజా ప్రతినిధులు, ముదిరాజ్ కుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు