ఏడే అల్లరి వనమాలి!!! నను వీడే మనసున దయమాలి !!! Song
ఏడే అల్లరి వనమాలి,
నను వీడే మనసున దయమాలి
మోహన బాలుడు మురళీ లోలుడు
మా గోపాలుడు ఏడే ఏడే
ఏడే అల్లరి వనమాలి,
నను వీడే మనసున దయమాలి
యమునా తీరపు విరసిన భువిలో
వినరాదేమే మురళీ గానము
కాళీయునిపై న్రృత్యమాడే
నా మనోహరుడు కనరాడేమే
ఏడే అల్లరి వనమాలి,
నను వీడే మనసున దయమాలి
చేయి చేతిలో జతగా కలిపి బాస చేసెనే,
బాసి పోనని అంత లోపల నను వంచించి
ఎందు బోయెనో కనరాడేమే
ఏడే అల్లరి వనమాలి,
నను వీడే మనసున దయమాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి