ఒక్కేసి పువ్వేసి చందమామ !!!Bathukamma Song Lyrics
ఒక్కేసి పువ్వేసి సందమామ… ఒక్క జాము ఆయే సందమామ
(ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క జాము ఆయే సందమామ)
సూడొచ్చె యాల్లాయే సందమామ… శివుడు రాకపాయె సందమామ
(సూడొచ్చె యాల్లాయే సందమామ… శివుడు రాకపాయె సందమామ)
శివుడికి శ్రీగద్దె సందమామ… మాకు సారెగద్దె సందమామ
(శివుడికి శ్రీగద్దె సందమామ… మాకు సారెగద్దె సందమామ)
రెండేసి పూలేసి సందమామ… రెండుజాములాయే సందమామ
(రెండేసి పూలేసి సందమామ… రెండుజాములాయే సందమామ)
శివపూజ యాల్లాయె సందమామ… శివుడు రాకపాయె సందమామ
(శివపూజ యాల్లాయె సందమామ… శివుడు రాకపాయె సందమామ)
మూడేసి పూలేసి సందమామ… మూడుజాములాయే సందమామ
(మూడేసి పూలేసి సందమామ… మూడుజాములాయే సందమామ)
శివుడింక రాడాయే సందమామ… శివుడి పూజలాయె సందమామ
(శివుడింక రాడాయే సందమామ.. శివుడి పూజలాయె సందమామ)
గోరెంట సెట్లల్ల సందమామ… గోడపెట్టబాయె సందమామ
(గోరెంట సెట్లల్ల సందమామ… గోడపెట్టబాయె సందమామ)
నాల్గేసి పూలేసి సందమామ… నాల్గుజాములాయే సందమామ
(నాల్గేసి పూలేసి సందమామ… నాల్గుజాములాయే సందమామ)
శివపూజలాల్లాయె సందమామ… శివుడు రాకపాయె సందమామ
(శివపూజలాల్లాయె సందమామ… శివుడు రాకపాయె సందమామ)
రుద్రాక్ష వనముల సందమామ… నిద్రించపాయె సందమామ
(రుద్రాక్ష వనముల సందమామ… నిద్రించపాయె సందమామ)
ఐదేసి పూలేసి సందమామ… ఐదుజాములాయే సందమామ
(ఐదేసి పూలేసి సందమామ… ఐదుజాములాయే సందమామ)
శివుడింక రాడాయే సందమామ… శివుని పూజలాయె సందమామ
(శివుడింక రాడాయే సందమామ… శివుని పూజలాయె సందమామ)
బంతి వనములోన సందమామ… బంతులాడబాయె సందమామ
(బంతి వనములోన సందమామ… బంతులాడబాయె సందమామ)
ఆరేసి పూలేసి సందమామ… ఆరుజాములాయే సందమామ
(ఆరేసి పూలేసి సందమామ… ఆరుజాములాయే సందమామ)
శివపూజలాల్లాయె సందమామ… శివుడు రాకపాయె సందమామ
(శివపూజలాల్లాయె సందమామ… శివుడు రాకపాయె సందమామ)
మల్లె వనములోన సందమామ… మాటలాడబాయె సందమామ
(మల్లె వనములోన సందమామ… మాటలాడబాయె సందమామ)
ఏడేసి పూలేసి సందమామ… ఏడుజాములాయే సందమామ
(ఏడేసి పూలేసి సందమామ… ఏడుజాములాయే సందమామ)
రత్నాలగౌరు సందమామ… నీ రాశికలుపుల్లు సందమామ
(రత్నాలగౌరు సందమామ… నీ రాశికలుపుల్లు సందమామ)
ఎనిమిదో పువ్వేసి సందమామ… ఎన్మిది జాములాయే సందమామ
(ఎనిమిదో పువ్వేసి సందమామ… ఎన్మిది జాములాయే సందమామ)
తీగెతీగెల బిందె సందమామ… రాగితీగెల బిందె సందమామ
(తీగెతీగెల బిందె సందమామ… రాగితీగెల బిందె సందమామ)
తొమ్మిదో పువ్వేసి సందమామ… తొమ్మిది జాములాయే సందమామ
(తొమ్మిదో పువ్వేసి సందమామ… తొమ్మిది జాములాయే సందమామ)
రాశి వడబోసి సందమామ… రాశి కలుపరావె సందమామ
(రాశి వడబోసి సందమామ… రాశి కలుపరావె సందమామ)
పదేసి పూలేసి సందమామ… పది జాములాయే సందమామ
(పదేసి పూలేసి సందమామ… పది జాములాయే సందమామ)
తీగెతీగెల బిందె సందమామ… రాగితీగెల బిందె సందమామ
(తీగెతీగెల బిందె సందమామ… రాగితీగెల బిందె సందమామ)
శివుపూజ యాల్లాయె సందమామ… శివుడు రాకపాయె సందమామ
(శివుపూజ యాల్లాయె సందమామ… శివుడు రాకపాయె సందమామ)
శివుడికి శ్రీగద్దె సందమామ… మాకు సారెగద్దె సందమామ
(శివుడికి శ్రీగద్దె సందమామ… మాకు సారెగద్దె సందమామ)
శివుడికి శ్రీగద్దె సందమామ… మాకు సారెగద్దె సందమామ
(శివుడికి శ్రీగద్దె సందమామ… మాకు సారెగద్దె సందమామ)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి