రామ రామ రామ ఉయ్యాలో!! బతుకమ్మ సాంగ్


 

రామ రామ రామ ఉయ్యాలో పాట

రామ రామ రామ ఉయ్యాలో

రామనే శ్రీరామ ఉయ్యాలో

రామ రామానంది ఉయ్యాలో

రాగమెత్తరాదు ఉయ్యాలో



హరిహరియా రామ ఉయ్యాలో

హరియా బ్రహ్మదేవ ఉయ్యాలో

హరి అన్నవారికి ఉయ్యాలో

ఆపదలూ రావు ఉయ్యాలో



శరణన్న వారికి ఉయ్యాలో

మరణంబు లేదు ఉయ్యాలో

రామ రామ ఉయ్యాలో

రామనే శ్రీరామ ఉయ్యాలో

ముందుగా నిను తల్తు ఉయ్యాలో

ముత్యాల పోశమ్మ ఉయ్యాలో

తర్వాత నిను దల్తు ఉయ్యాలో

తల్లిరో పెద్దమ్మ ఉయ్యాలో

ఆదిలో నిను దల్తు ఉయ్యాలో

ఆయిలోని మల్లన్న ఉయ్యాలో



కోరుతా నిను దల్తు ఉయ్యాలో

కొమురెల్లి మల్లన్న ఉయ్యాలో

మారుగా నిను దల్తు ఉయ్యాలో

మావురాల ఎల్లమ్మ ఉయ్యాలో

భోగాన నిను దల్తు ఉయ్యాలో

బొంతపల్లి ఈరన్న ఉయ్యాలో

శరనన్న వరంగల్లు ఉయ్యాలో

శంభుడా నిన్ను దల్తు ఉయ్యాలో



రామరామ ఉయ్యాలో

రామనే శ్రీరామ ఉయ్యాలో

శ్రీరామ జయరామ ఉయ్యాలో

అయోధ్య రామ ఉయ్యాలో

తొక్కుదునా భూదేవి ఉయ్యాలో

మెుక్కుదునే నిన్ను ఉయ్యాలో

బాధల్ల నిను దల్తు ఉయ్యాలో

భద్రాద్రి రామన్న ఉయ్యాలో

గుండెల్లో నిను దల్తు ఉయ్యాలో



కొండగట్టు అంజన్న ఉయ్యాలో

ఎప్పుడు నిను దల్తు ఉయ్యాలో

ఎములాడ రాజన్న ఉయ్యాలో

యాదిలో నిను దల్తు ఉయ్యాలో

యాదగిరి నర్సన్న ఉయ్యాలో

సింతల్ల మిము దల్తు ఉయ్యాలో

సమ్మక్క సారక్క ఉయ్యాలో

కీర్తిగా నిను దల్తు ఉయ్యాలో



కీసర రామన్నా ఉయ్యాలో

రామ రామ రామ ఉయ్యాలో

రామనే శ్రీరామ ఉయ్యాలో

కోదండరామ ఉయ్యాలో

అందరినీ తలిచి ఉయ్యాలో



గంగ నిన్ను మరిచి ఉయ్యాలో

గంగ నిలు తలవంది ఉయ్యాలో

ఘడియ నిలువ లేము ఉయ్యాలో

మోతుకు చెట్టు కింద ఉయ్యాలో

పుట్టినావే గంగ ఉయ్యాలో

మెులమంటి కాలువాలు ఉయ్యాలో



పారినావే గంగ ఉయ్యాలో

జిల్లేడు చెట్టుకింద ఉయ్యాలో

పుట్టినావే గంగ ఉయ్యాలో

జిలా జిలా కాలువలు ఉయ్యాలో

పారినావే గంగ ఉయ్యాలో

ఊడుగు చెట్టు కింద ఉయ్యాలో

పుట్టినావే గంగ ఉయ్యాలో

ఉరుము ఉరిమి కాలువలు ఉయ్యాలో

పారినావే గంగ ఉయ్యాలో



కట్టినావు గంగ ఉయ్యాలో

పట్టంచు చీరలు ఉయ్యాలో

తొడిగినావు గంగ ఉయ్యాలో

ముత్యాల రవికెలు ఉయ్యాలో

పూసినావు గంగ ఉయ్యాలో

పుట్టెడు భండారు ఉయ్యాలో

పెట్టినావు గంగ ఉయ్యాలో

బేరి కుంకుమ ఉయ్యాలో

కట్టినావు గంగ ఉయ్యాలో



గవ్వల మండోలు ఉయ్యాలో

గంగ నువ్వు లేక ఉయ్యాలో

ఘడియ నిలువ లేము ఉయ్యాలో

గంగ నీకు శరణు ఉయ్యాలో

తల్లి నీకు శరణు ఉయ్యాలో



మానేరు మానేరు ఉయ్యాలో పాట

మానేరు మానేరు ఉయ్యాలో..

మంచిది కస్తూరి ఉయ్యాలో..

మన ఊరి రక్షణకు ఉయ్యాలో..

రాజు ఎవ్వరూ ఉయ్యాలో..

మన ఊరి రక్షణకు ఉయ్యాలో..

రాజు దశరథుడు ఉయ్యాలో..





ముత్యాల గద్దెలకు ఉయ్యాలో..

దేవీలెవ్వరు ఉయ్యాలో..

దేవీ కౌసల్య ఉయ్యాలో..

కోటి వెయ్యి గుర్రాల ఉయ్యాలో..

కొడుకూ శ్రీరాములు ఉయ్యాలో..

కోటి సంతతి దిద్ద ఉయ్యాలో..

కోడలు ఎవ్వరూ ఉయ్యాలో..

కోటి సంతతి దిద్ద ఉయ్యాలో..

పగడాల తొట్టేలకు ఉయ్యాలో..



బాలుడూ ఎవ్వరూ ఉయ్యాలో..

పగడాల తొట్టెలకు ఉయ్యాలో..

బాలుడూ లక్ష్మణుడు ఉయ్యాలో..

బీరపు జాకిట్లు ఉయ్యాలో..

బిడ్డా శాంతమ్మ ఉయ్యాలో..

ఆరువేల వందనాలు ఉయ్యాలో..

అల్లుడూ ఎవ్వరూ ఉయ్యాలో..



ఆరు వేల వందనాలు ఉయ్యాలో..

అల్లుడూ దీమంతుడు ఉయ్యాలో..

మానేరు మానేరు ఉయ్యాలో..

మంచిది కస్తూరి ఉయ్యాలో..


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు