ఏమేమి పువ్వోప్పు నే గౌరమ్మ బతుకమ్మ సాంగ్



ఏమేమి పువ్వోప్పు నే గౌరమ్మ   

ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ 

ఏమేమి కాయప్పునే 

తంగేడు పువ్వోప్పునే గౌరమ్మ 




తంగేడు కాయప్పునే

తంగేడు పువ్వులో తంగేడు కాయలో

ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు

కలికి చిలుకలు రెండు కందువా మేడలో …1



ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ 

ఏమేమి కాయప్పునే 

తెలుగంటి  పువ్వోప్పునే గౌరమ్మ 

తెలుగంటి కాయప్పునే

తెలుగంటి పువ్వులో తెలుగంటి కాయలో

ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు

కలికి చిలుకలు రెండు కందువా మేడలో ….2




ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ 

ఏమేమి కాయప్పునే 

ఉమ్మెత్త   పువ్వోప్పునే గౌరమ్మ 

ఉమ్మెత్త  కాయప్పునే

ఉమ్మెత్త  పువ్వులో ఉమ్మెత్త  కాయలో

ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు

కలికి చిలుకలు రెండు కందువా మేడలో …3


ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ 

ఏమేమి కాయప్పునే 

జిల్లేడు పువ్వోప్పునే గౌరమ్మ 

జిల్లేడు  కాయప్పునే

జిల్లేడు  పువ్వులో జిల్లేడు  కాయలో

ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు

కలికి చిలుకలు రెండు కందువా మేడలో …4



 ఏమేమి పువ్వోప్పు నే గౌరమ్మ 

ఏమేమి కాయప్పునే 

మందార  పువ్వోప్పునే గౌరమ్మ 

మందార   కాయప్పునే

మందార పువ్వులో మందార   కాయలో

ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు

కలికి చిలుకలు రెండు కందువా మేడలో ….5



ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ 

ఏమేమి కాయప్పునే 

గుమ్మడి పువ్వోప్పునే గౌరమ్మ 

గుమ్మడి కాయప్పునే

గుమ్మడి పువ్వులో గుమ్మడి కాయలో

ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు

కలికి చిలుకలు రెండు కందువా మేడలో …6



ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ 

ఏమేమి కాయప్పునే 

గన్నేరు పువ్వోప్పునే గౌరమ్మ 

గన్నేరు  కాయప్పునే

గన్నేరు  పువ్వులో గన్నేరు కాయలో

ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు

కలికి చిలుకలు రెండు కందువా మేడలో..7





కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు