హసన్‌పర్తిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి
హసన్‌పర్తిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి- పాల్గొన్న GWMC 66వ డివిజన్ కార్పోరేటర్ శ్రీ గురుమూర్తి శివకుమార్, BRS పార్టీ అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కాగా ఈరోజు హసన్‌పర్తిలో వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ అరూరి రమేష్ గారు ప్రారంభించారు.తెలంగాణ రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుందని, గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిగా, పట్టణాల్లో వార్డును పరిధిగా కంటి వెలుగు క్యాంపులను నిర్వహిస్తారని, ఈ క్యాంపులో ఒక మెడికల్ ఆఫీసర్, కంటి వైద్యుడు, ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు,R.P లు,ఆశా వర్కర్లతో కూడిన ఆరు నుంచి ఎనిమిది మందితో కూడిన బృందం సేవలందిస్తుందని వీరితో పాటు మహిళ సంఘాల అద్యక్షులు కూడా పాల్గొన్నారని ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు పేర్కొన్నారు.ఈ పథకాన్ని ప్రభుత్వ ఖర్చుతో తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వీసం సురేందర్ రెడ్డి,సీనియర్ నాయకులు పిట్టల కుమారస్వామి,ఆత్మ చైర్మన్ కందుకూరి చంద్రమోహన్, బోడ యుగంధర్,పెద్దమ్మ నర్షింహరాములు,వేల్పుల సదానందం, గౌరిశెట్టి కృష్ణమూర్తి,నాలిగేటి అనిల్ కుమార్ యాదవ్,మేకల రాజేందర్,పుల్ల నరేందర్,ముద్దసాని సురేష్,ఆకుల ప్రభాకర్,నల్ల కిరణ్,కందుకూరి సాయి చందు,పొరండ్ల శ్రీకాంత్, కాజీపేట అన్నమాచార్య, వెల్గెటి రాజిరెడ్డి మరియు పార్టీ సినీయర్ నాయకులు, సోషల్ మీడియా సభ్యులు మరియు తడితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి