కంటి వెలుగు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అరూరి
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం లో భాగంగా హసనపర్తి పట్టణ కేంద్రంలో కంటి వెలుగు కేంద్రాన్ని బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే గారు కంటి సమస్యల తో వచ్చిన వృద్ధులను ఆప్యాయంగా పలకరించి,ఆసుపత్రి సిబ్బంది ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు, మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి