పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే అరూరి..

 













వర్దన్నపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అగ్ర భాగాన నిలపడమే లక్ష్యంగా పని చేస్తున్నానని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు అన్నారు.


గ్రేటర్ వరంగల్ 2వ డివిజన్  పరిధిలోని వంగపహాడ్ గ్రామంలో 1కోటి 46లక్షలతో చేపట్టనున్న సిసి రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు శంకుస్థాపనలు చేశారు.


 ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం లో  ఎక్కడా లేనటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. ప్రజా సంక్షేమమే ద్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పని చేస్తున్నారని తెలిపారు. రైతు బందు, రైతు భీమా, దళిత బందు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్ వంటి అనేక  ప్రజా సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఇంటికి అందిస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు దేశ ప్రజలకు అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ గారు జాతీయ పార్టీకి రూపకల్పన చేశారాని తెలిపారు.


ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు,  గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు