నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరించిన అరూరి విశాల్
- పాల్గొన్న 66వ డివిజన్ BRS అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్ గారు
అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 26 నుండి నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.హాసన్ పర్తి మండల పరిధిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించేందుకు మండల పరిధిలోని GWMC 65వ డివిజన్ ఎల్లాపూర్ లోని KPR అగ్రి కంపెనీ ఎదురుగా ఉన్న స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆ ఫౌండేషన్ కార్యదర్శి అరూరి విశాల్ గారు పోస్టర్ ను ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ
లీగ్ స్థాయి : మండల కేంద్రాల్లో గ్రామాల వారీగా 12 ఓవర్ల మ్యాచ్ లు.
సూపర్-8 : మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన 8 జట్లతో నియోజకవర్గ కేంద్రంలో 16 ఓవర్ల మ్యాచ్ లు.20 ఓవర్లతో ఫైనల్ మ్యాచ్.ప్రథమ బహుమతి 1,00,000/- (లక్ష రూపాయలు).
ద్వితీయ బహుమతి 50,000/- (యాభై వేల రూపాయలు).
సూపర్ - 8 కి చేరిన ప్రతి జట్టుకి (ఫైనల్ కీ చేరిన 2 జట్లు మినహా) 10,000/- పది వేల రూపాయల నగదు బహుమతి ఉంటుందన్నారు కావున నియోజకవర్గంలో ఉన్న క్రికెట్ క్రీడాకారులందరూ త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.రిజిస్ట్రేషన్ లకై 9059069310,9696326666, 9989432091,9951426666 ఈ నంబర్లను సంప్రదించాలని సూచించారు.వారితో పాటు మండల పార్టీ అధ్యక్షులు బండి రజినీ, ఆత్మకూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ వీసం సురేందర్ రెడ్డి,65వ డివిజన్ మాజీ కార్పొరేటర్ రాజు నాయక్,డివిజన్ అధ్యక్షులు ఎరుకొండ శ్రీనివాస్, అనంతసాగర్ సర్పంచ్ బండ అనితా- జీవన్ రెడ్డి, హాసన్ పర్తి PACS వైస్ చైర్మన్ మల్లారెడ్డి, 66వ డివిజన్ యూత్ అధ్యక్షులు వల్లాల శ్రీకాంత్ గౌడ్,నాయకులు ఆరేపల్లి శ్రవణ్,యూత్ నాయకులు వేల్పుల సాయికుమార్ యాదవ్, కందుకూరి సాయి చందు,ఆకుల ప్రభాకర్,అంబాల రమేష్ శీలం అనిల్,కాజీపేట అన్నమాచార్య తదితరులున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి