గ్రేటర్ వరంగల్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే అరూరి సమీక్షా సమావేశం
వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని 13డివిజన్ల ప్రజా ప్రతినిధులు, డివిజన్ ప్రెసిడెంట్లు, ముఖ్య నాయకులతో హన్మకొండ హంటర్ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ డివిజన్ లోని ప్రతీ 100మంది ఓటర్లకు ఒక ఇంచార్జ్ నియమాకాన్ని తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు. వీలైనంత తొందరగా ఇంచార్జ్ ల నియమాకాన్ని పూర్తి చేసి ఆ 100వంద మంది ఓటర్లకు ఇంచార్జ్ లు నిత్యం అందుబాటులో ఉండాలని అన్నారు. వారికి పార్టీ తరపున, ప్రభుత్వం తరపున అందించాల్సిన సహాయ సహకారాలు అందే విధంగా వారి అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలనీ తెలిపారు. ప్రభుత్వం నుండి ఇప్పటివరకు అందిన పథకాలు, ఇంకా అండవలసిన పథకాల వివరాలను సేకరించాలని అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాబోయే ఎన్నికలలో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలనీ ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, డివిజన్ ప్రసిడెంట్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి