కట్ర్యాల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే అరూరి.





 


వర్దన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్బంగా నిర్వహిస్తున్న మల్లికార్జున స్వామి జాతరకు డీసీసీబీ చైర్మన్ మార్నెని రవీందర్ రావు గారితో కలిసి బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు హాజరై స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ పూజారులు, గ్రామస్తులు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం 72లక్షలతో గుడి చుట్టూ నిర్మంచిన సిసి రోడ్డును ప్రారంభించి, మెయిన్ రోడ్డు నుండి గుడి వరకు నిర్మించనున్న బిటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.


ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు