ఉచిత ఆయుష్ మెగా హెల్త్ క్యాంప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి







గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ జవహర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో సీనియర్ సిటీజన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆయుష్ మెగా హెల్త్ క్యాంప్ ను బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ముఖ్య అతిథిగా హాజరై  ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రజలు ఈ మెగా ఉచిత హెల్త్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సిరంగి సునీల్ కుమార్, డివిజన్ ప్రెసిడెంట్ మణింద్రనాథ్, డివిజన్ నాయకులు, సీనియర్ సిటిజన్ వెల్ఫెర్ నాయకులు, వైద్య సిబ్బంది, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు