మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ను హెచ్చరించిన BRS నేతలు




హాసన్ పర్తి 66వ డివిజన్ BRS పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు,BRS వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆరూరి రమేష్ గారిపై అసత్యపు ప్రచారాలను మానుకోవాలని బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ ని హెచ్చరించారు.వర్ధన్నపేట నియోజకవర్గంలో ఆరూరి రమేష్ అన్న గారు చేపడుతున్న అభివృద్ధి పనులను,అభిమానాన్ని ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. మీరు ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో హాసన్ పర్తి పరిధిలో మీరు చేసిన కబ్జాలు వెలకట్టలేనివి ఈ విషయం హాసన్ పర్తి ప్రజలందరికీ తెలిసిందే,మీ వైఖరిని మార్చుకోకపోతే హాసన్ పర్తి ప్రజలే మిమ్మల్ని తరిమికొట్టే పరిస్థితి ఏర్పడుతుందని, తస్మాత్ జాగ్రత్త అని నాయకులు హెచ్చరించారు.ఈ సమావేశంలో సీనియర్ నాయకులు బోడ యుగెంధర్,గిన్నారపు రవీందర్,మేకల తిరుపతి,వల్లాల శ్రీకాంత్ గౌడ్,ఆరేపెల్లి శ్రవణ్,మేకల రాజేందర్,కందుకూరి సాయి చందు,నల్ల కిరణ్,ఆకుల ప్రభాకర్,జన్ను మధు,బోడ ప్రమోద్,కాజీపేట అన్నమాచార్య,మేకల వినయ్,మేకల కరుణాకర్,శ్రీకాంత్,దాసరి నగేష్, సోషల్ మీడియా సభ్యులు తదితరులున్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు