BRS పార్టీ కిసాన్ సెల్ ఏర్పాటు ..!

 


 BRS జాతీయ కార్యాలయం ప్రారంభంతో దేశ రాజకీయాల్లో కార్యకలాపాలు మొదలుపెట్టి న తెలంగాణా ముఖ్యమంత్రి,BRS పార్టీ జాతీయ అధ్యక్షుడు జాతీయ స్థాయి నియామకాలకూ శ్రీకారం చుట్ట డం మొదలు పెట్టారు. బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా జాతీయ రైతు సంఘం నేత గుర్నాంసింగ్ ని నియమించిన కేసీఆర్.. నియామకపత్రాన్ని స్వయంగా అందించ డం జరిగింది.

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి.. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్పు జరిగినది. పార్టీ ఎంచుకున్న లక్ష్యానికి అనుగుణంగానే జాతీయ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ తొలి నియామకం చేపట్టారు. బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా జాతీయ రైతు సంఘం నేత గుర్నాంసింగ్ చడూనిని నియమించ డం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జాతీయ అధ్యక్ష హోదాలో నియామక పత్రంపై కేసీఆర్ తొలి సంతకం చేశారు. గుర్నాసింగ్ కు స్వయంగా నియామకపత్రాన్ని అందించడం జరిగింది. ఢిల్లీలోని బీఆర్ఎస్ జాతీయ కార్యాలయ కార్యదర్శిగా రవి కొహార్ ను నియమించారు. త్వరలోనే ఏపీ, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల బాధ్యులను ప్రకటించే అవకాశం ఉంది. ఆయా రాష్ట్రాల నుంచి పలువురు నేతలతో కేసీఆర్ ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు