హసన్ పర్తి జడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం!!.


 హసన్ పర్తి జడ్పీఎస్ఎస్ పాఠశాలలో 1962-1968 ఈరోజు HSC పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రాంనరసింహచారి సార్  ,గౌరవ అతిథిగా gwmc 66 వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ గురుమూర్తి శివకుమార్ ,పోన్నోజు శంకరయ్య ,చిధర శంకరయ్య హాజరై మాట్లాడారు.ఈ కార్యక్రమానికి వినోద్ కుమార్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా నరసింహాచా రీ గారు మాట్లాడుతూ పూర్వ కాలం లో నైతిక విలువతో కూడిన విద్యే ప్రామాణికంగా వుండేది అన్నారు.ప్రస్తుతం కార్పొరేట్ విద్యా వల్ల నైతిక విలువలతో కూడిన విద్య అందని ద్రాక్ష లా మారిందని కొనియాడారు.అనంతరం HSC పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. ప్రోగ్రాం ఆర్గనైజర్ లు పావు శెట్టి రమణయ్య, వెల్గందుల భీష్మణాధం,మెరుగు నరసింహారాములు,గూడూరు రామ్మూర్తి, దాసరి రాజన్ బాబు, వీ సం సమ్మి రె డ్డి, పావుశెట్టీ సాంబయ్య,లక్ష్మి నారాయణ ,గోలి వేకట్రాం రె డ్డి తో పాటు ఇతర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు