హసన్ పర్తి ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే అరూరి
హన్మకొండ హంటర్ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హాసన్ పర్తి మండల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులతో తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వద్దకు వివరించాలని నాయకులకు సూచించారు. అలాగే పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలనీ కోరారు. ఏమైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు కొత్త పాత అనే తేడా లేకుండా అందరూ కలిసి సమిష్టి నిర్ణయాలతో పార్టీ పటిష్టానికి కృషి చేయాలనీ వివరించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి