డీసీసి బ్యాంక్ వర్దన్నపేట కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి

 










వర్దన్నపేట మున్సిపాలిటీ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీసీ బ్యాంక్ కార్యాలయాన్ని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, డీసీసీబీ చైర్మన్ మార్నెని రవీందర్ రావు గారితో కలిసి తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రైతు కోసం, రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం తెరాస ప్రభుత్వమని అన్నారు. వర్దన్నపేట రైతులకు అందుబాటులో అన్ని వసతులతో కూడిన బ్యాంక్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్ గారు రైతులకు అన్ని వేళలా అండగా ఉంటున్నారని తెలిపారు. తెలంగాణ రైతులకు పెట్టుబడికి రైతు బందు, సకాలంలో ఎరువులు అందించడం, పండిన పంటను రైతు కల్లాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేయడం, ప్రమాదవశాత్తు మరణించిన రైతులకు 5లక్షల భీమా సౌకర్యాన్ని కల్పించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. ఏది ఏమైనా రైతు కళ్ళల్లో ఆనందం చూడటమే టీఆరెఎస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బ్యాంక్ అధికారులు, పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, నాయకులు, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు