టీఆరెఎస్ పార్టీలోకి భారీగా చేరికలు






గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ పరిధిలోని ఏనుమాముల నుండి వివిధ పార్టీలకు చెందిన  సుమారు 50మంది  నాయకులు, యువకులు, మహిళలు కార్యకర్తలు హాసన్ పర్తిలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారి సమక్షంలో టీఆరెఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో కొత్త పాత అనే తేడా లేకుండా అందరిని కలుపుకొని ముందుకు వెళ్లాల్లడంతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేయాలనీ నాయకులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలని తెలిపారు.


ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు