పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఎమ్మెల్యే అరూరి
తెలంగాణలో పేద ప్రజల సంక్షేమం కోసం పూర్తి భరోసానిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు.
ఐనవోలు మండలం కొండపర్తి, నర్సింహులాగూడెం గ్రామాలకు చెందిన 5గురు ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 3లక్షల 10వేల రూపాయల విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం ,ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు తెలంగాణ ప‌్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోందని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు.
రాష్ట్రంలో వైద్యం, విద్యకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, రాష్ట్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారు భయపడవద్దని.. ప్రభుత్వం తరపున ఆర్ధిక సహాయం అందిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. అనంతరం కొండపర్తి గ్రామానికి చెందిన సింగారపు శాంతమ్మ గారు మరణించడంతో వారి మృతదేహానికి పూల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే గారు ఇటీవల మరణించిన ఎండి. యాకుబ్ పాషా, గువ్వల సాంబయ్య గారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి