పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే అరూరి....
వర్దన్నపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అగ్ర భాగాన నిలపడమే లక్ష్యంగా పని చేస్తున్నానని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు అన్నారు.
పర్వతగిరి మండలం మంత్య తండా, బూరుగుమల్ల, చింతనెక్కొండ, బట్టు తండా గ్రామాలలో 7కోటి 86లక్షలతో చెప్పట్టిన స్మశాన వాటిక, డంపింగ్, పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రంథాలయం, ఆర్ అండ్ బీ రోడ్డు, మహిళా సంఘం కమ్యూనిటీ హల్ మరియు సిసి రోడ్లు వంటి అభివృద్ధి పనులను ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ప్రారంభించారు. అనంతరం బూర్గుమల్ల, చింతనెక్కొండ గ్రామాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం లో ఎక్కడా లేనటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెరాస ప్రభుత్వమేనని అన్నారు. ప్రజా సంక్షేమమే ద్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పని చేస్తున్నారని తెలిపారు. రైతు బందు, రైతు భీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్ వంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఇంటికి అందిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు, ఎంపిటిసిలు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి