లైటింగ్ తో ఆకర్షణీయంగా సనత్ నగర్ మెట్ల బావి

 సనత్ నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్ పేట లోని మెట్ల బావిని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం సాయంత్రం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ప్రారంభిస్తారు. నిజాం కాలంలో స్థానిక ప్రజల త్రాగునీటి అవసరాల కోసం నిర్మించిన మెట్ల బావి కాలక్రమేణా సరైన నిర్వహణ లేక చెత్త చెదారంతో పూర్తిగా నిండిపోయింది. మంత్రి KTR చొరవ తో ఈ మెట్ల బావి పునరుద్ధరణ పనులు చేపట్టడం జరిగింది. ఇందులో పేరుకుపోయిన చెత్తను తరలించడానికి 6 నెలల సమయం పట్టింది. ఈ బావిని పునరుద్ధరించిన అనంతరం నీటితో నిండుగా కలకళలాడుతుంది. అంతేకాకుండా ఈ బావి లోపల ఏర్పాటు చేసిన లైటింగ్ తో రాత్రి వేళ మెట్ల బావి ఆకర్షణీయంగా రూపుదిద్దుకొని చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో బావి పక్కనే నిర్మించిన టూరిజం ప్లాజా, గార్డెన్,  నూతనంగా ఏర్పాటు చేసిన లైట్లు, పరిసరాలలో చేపట్టిన అభివృద్ధి పనులతో ఆప్రాంతం కొత్తదనాన్ని పొందినట్లు గా కనిపిస్తుంది.





Source:KtrYouth

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు