కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరూరి
మహిళలు స్వంతంగా ఆర్థిక వనరులు సమాకుర్చుకొని ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు అన్నారు.గ్రేటర్ వరంగల్ 1వ డివిజన్ ముచ్చెర్ల లోని మహిళా కమ్యూనిటీ హాల్లో జాతీయ నిర్మాణ అకాడమీ, తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి ద్వారా స్వయం ఉపాధి టైలరింగ్‌లో శిక్షణ పొందిన 50మంది మహిళలకు కుట్టు మిషన్, ధృవీకరణ పత్రాలను ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు పంపిణి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళల ఆర్థిక అభివృద్ధి, మహిళా సాధికారాతే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ఉపాధి కల్పించేలా అనేక కుటీర పరిశ్రమల స్థాపనకు, స్వయం ఉపాధి అవకాశాలనుతెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందని పేర్కొన్నారు. న్యాక్ ద్వారా మహిళలకు మూడు నెలలు శిక్షణ ఇచ్చి వారికి ధ్రువ పత్రాలతో పాటు కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు. అర్హులైన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, డివిజన్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి