ఆరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాకు విశేష స్పందన
*మెగా జాబ్ మేళాకు విశేష స్పందన.....*
*భారీగా తరలివచ్చిన నిరుద్యోగ యువతి, యువకులు....*
*జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి....*
వర్దన్నపేట నియోజకవర్గ మరియు వరంగల్ జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువతి, యువకులు 1500 ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
నిరుద్యోగులకు ఉద్యోగ కల్పించాలనే ఉద్దేశ్యంతో అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మామునూర్ 4వ బేటాలియన్ పక్కన ఉన్న HRS గార్డెన్స్ లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చింది. 100కు పైగా కంపెనీలు పాల్గొన్న ఈ జాబ్ మేళాకు నిరుద్యోగ యువతి, యువకులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నిరుద్యోగ యువతి, యువకులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ద్వారా యువత కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గతంలో నిర్వహించిన జాబ్ మేళా ద్వారా సుమారు 450మందికి ఉద్యోగాలు లభించాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేని విధంగా భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్న తరుణంలో నిరుద్యోగ యువత ఆ ఉద్యోగాలను అందిపుచుకోవాలని 100రోజుల పాటు ఉచిత శిక్షణ, స్టడీ మెటీరియల్, భోజన వసతితో అందించినట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా ఇటీవల జరిగిన ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలో 437మంది అభ్యర్థులు అర్హత సాధించడంతో వారికి దేహాదారుడ్య శిక్షణ సైతం అందిస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ద్వారా విద్యా, ఉద్యోగ, క్రీడా, ఆరోగ్య పరంగా కూడా అనేక మందికి సహాయ సహకారాలు సందిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రయివేట్ రంగాలలో కూడా ఉద్యోగ అవకాశాలను అందిపుచుకోవాలనే లక్ష్యంతో ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాకు హాజరైన ప్రతీ ఒక్కరూ ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ సెక్రెటరీ అరూరి విశాల్, అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ సిఈవో కొయ్యడ రాజు, అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆర్గనైజింగ్ కోఆర్డినేటర్లు, వర్దన్నపేట నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, వివిధ కంపెనీల ప్రతినిధులు, యువతి, యువకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి