కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరికి, రైతు వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా భారీ నిరసన దీక్ష
BRS పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ గారి పిలుపు మేరకు BRS పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారి ఆధ్వర్యంలో వరంగల్ ఓ సిటీ గ్రౌండ్ వద్ద భారీ నిరసన దీక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్న గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్షపూరిత ధోరణితో కక్ష్యపూరితంగా వ్యవహారిస్తు ఉపాధి హామీ పథకం కింద రైతులు నిర్మించుకున్న వ్యవసాయ కల్లాల నిర్మాణానికి ఖర్చయిన 151కోట్లను తిరిగి చెల్లించాలని రాష్ట్రానికి నోటీసులు ఇవ్వడం, తెలంగాణ రైతులు నిర్మించుకున్న పంట ఆరబొత కల్లాలపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించడాన్ని వ్యతిరేకస్తూ ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు.ఈ నిరసన కార్యక్రమంలో 66వ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు పాపిశెట్టి శ్రీధర్ గారి సూచన మేరకు హాసన్ పర్తి 66వ డివిజన్ నుండి ఆత్మకూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వీసం సురేందర్ రెడ్డి,చకిలం రాజేశ్వర్ రావు,సీనియర్ నాయకులు పిట్టల కుమారస్వామి,66వ డివిజన్ యూత్ అధ్యక్షులు వల్లాల శ్రీకాంత్ గౌడ్, అరేపల్లి శ్రవణ్,మేకల రాజేందర్,ఆకుల ప్రభాకర్,కందుకూరి సాయి చందు,తాళ్ళ సంపత్,కాజీపేట అన్నమాచార్య,మేకల మధు, గొర్రె ప్రణయ్, మేకల పున్నం చందర్ మరియు సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి