మత సామరస్యానికి ప్రతీక తెలంగాణ రాష్ట్రం.... ఎమ్మెల్యే అరూరి
క్రిస్మస్ పండుగ సంధర్బంగా హసన్ పర్తి మండలం సీతంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం తరపున క్రైస్తవ సోదరీ, సోదరులకు బట్టల పంపిణీ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ముఖ్య అతిథిగా హాజరై పేద క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేశారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు ముఖ్య మంత్రి కేసీఆర్ గారు సమ ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. పేద, ధనిక అనే తార తమ్యాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని మతాల పర్వదినాలను అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేద క్రైస్తవుల అభివృద్ధికి తాను ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హాసన్ పర్తి మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు క్రైస్తవ మత పెద్దలు తదితరులు పాల్గోన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి