కన్నుల పండుగగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ
అయ్యప్ప శరణుఘోషతో మారుమోగిన అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణం.
భారీ సంఖ్యలో తరలివచ్చిన అయ్యప్ప స్వాములు, ప్రజలు.
వర్దన్నపేట పట్టణం ఆకేరు వాగు ఒడ్డున గల శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్షన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ - కవిత కుమారి దంపతుల ఆధ్వర్యంలో నేడు రఘునందన్ గురుస్వామి చేతుల మీదుగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప మహా పడిపూజలో వర్దన్నపేట నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ అరూరి విశాల్ గారు పాల్గొని శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహానికి పాలాభిషేకం, నెయ్యాభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ ధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు వర్దన్నపేట నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని అరూరి విశాల్ గారు కోరుకున్నారు. అనంతరం మహా పడిపూజకు విచ్చేసిన భక్తులకు, ప్రజలకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం చేశారు. ఈ అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమంలో భారీ సంఖ్యలో అయ్యప్ప స్వాములు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి