తెలంగాణ పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష్యకట్టింది.
రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చూసి ఓర్వలేకనే బీజేపీ కుట్రలు చేస్తోంది....
రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న కల్లాలను చూసి బీజేపీ కడుపు మండుతోంది.....
కల్లాల ద్వారా రైతులకు కలుగుతున్న ప్రయోజనాలను పట్టించుకోకుండా చిల్లర రాద్ధాంతం చేస్తుంది....
ఉపాధి హామీ నిధుల మల్లింపు అంటూ దుష్ప్రచారం చేస్తోంది....
కేవలం తెలంగాణపై వివక్షతోనే రాష్ట్రంపై అనేక షరతులు పెడుతోంది....
తెలంగాణ ప్రభుత్వం.... రైతు సంక్షేమ ప్రభుత్వం....
తెలంగాణ రాష్ట్రం అనేక రైతు సంక్షేమ పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.....
రైతులకు మేము సాయం చెయ్యం... చేయనియ్యం అన్నట్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చెయ్యాలి....
వరంగల్ జిల్లా రైతు మహా ధర్నాలో ఎమ్మెల్యే అరూరి...
తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న కక్ష్యపూరిత వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారి ఆధ్వర్యంలో వరంగల్ ఓ సిటీ మైదానంలో *రైతు మహా ధర్నా* కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ బండా ప్రకాష్ గారు, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, చల్లా ధర్మా రెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కావాలనే కక్ష్యపూరిత వైఖరితో వ్యవహారిస్తోందని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం కింద రైతులు నిర్మించుకున్న వ్యవసాయ కల్లాల నిర్మాణానికి ఖర్చయిన 151కోట్లను తిరిగి చెల్లించాలని రాష్ట్రానికి నోటీసులు ఇవ్వడం కేంద్ర దుర్మార్గపు చర్య అని ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ అనుబంధ పనులకు అనుసంధానం చేయాలనీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వందల సార్లు విజ్ఞప్తి చేసినా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. పైగా ఇప్పుడు మొత్తం పథకాన్నే నీరుగార్చే విధంగా అనేక షరతులు, కోతలను కొత్తగా చేర్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు.
ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజును చేయాలని అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో రైతుల నడ్డివిరిచే ప్రయత్నం చేస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలని అహర్నిశలు కృషి చేస్తుంటే... కేంద్రం మాత్రం కార్పొరేట్ కంపెనీలతో కలిసి వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే విధంగా రైతు వ్యతిరేక చట్టాలను అమలులోకి తీసుకువస్తుందని అన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా మార్చాలానే కలతో రెండు ఏళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చెసి కోటి ఎకరాలను సాగులోకి తీసుకు వచ్చి రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకు రెండు పంటలకు నీరు అందించడమే కాదు, రైతులు అప్పుల ఊబి నుండి బయటకు రావాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఆకాంక్షతో భారత దేశ చరిత్రలోనే తొలిసారిగా రైతులకు నేరుగా నగదు అందించే రైతు బందు పథకాన్ని అమలు చేసి దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని వెల్లడించారు.
మొదటి నుంచి రైతుల పక్షపాతిగా ఉంటున్న బీఆర్‌ఎస్‌కు కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించడం లేదని ఆరోపించారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ వంటి అనేక సదుపాయాలు కల్పిస్తూ సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడమే కాకుండా సాగుకు అవసరమైన నీటి వనరుల పెంపుతో రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పంటలు పండిస్తూ పురోగతి సాధిస్తున్న తెలంగాణ రైతాంగాన్ని కేంద్రం ఏదో విధంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు. వరి వేయవద్దు అంటూ మెలికలు పెట్టి సాగు తగ్గించే కుట్రలు పన్నిన కేంద్రం తాజాగా, ఉపాధిహామీ పథకం కింద రైతులు నిర్మించుకున్న కల్లాలపై కత్తి కట్టిందని, ఈ కల్లాల బిల్లులు వాపసు ఇవ్వాలని దుష్ప్రచారానికి దిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా పరిధిలోని రైతులు, ఎంపిపిలు, జడ్పిటిసిలు, రైతు బందు సమితి కోఆర్డినేటర్లు, పీఏసీఎస్ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, ఎంపిటిసిలు, సర్పంచులు, కౌన్సిలర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాలు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి