ఘనంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవా లు
గ్రేటర్ వరంగల్ 66వ డివిజన్ హాసన్ పర్తిలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా నిన్న నిర్వహించిన ప్రత్యేక పూజలో తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన హోమంలో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానం లో పాల్గొన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే అరూరి గారికి గౌడ సంఘం ఆధ్వర్యంలో భారీ ఘజ మాలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, గౌడ సంఘం నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గౌడ కులస్తులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణ కార్యక్రమంలో పూర్తిస్థాయిలో సహకరించిన రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన గౌడ సంఘం ప్రతినిధులు. మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ కుల సంఘాల పెద్దలకు, నాయకులకు, గ్రామ ప్రజలకు పోలీస్ శాఖ సిబ్బందికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు గౌడ సంఘం సభ్యులు తెలియజేయడం జరిగింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి