మరోసారి మానవత్వం చాటుకున్న ఎస్సై జన్ను ఆరోగ్యం
దహన సంస్కరణలకు ఆర్థిక సాయం చేసిన ఎస్సై జన్ను ఆరోగ్యం... సైదాపూర్ లోని ఏ క్లాస్ పూర్ వద్ద నివాసముంటున్న నల్ల శ్రీనివాస్ s/o లక్ష్మయ్య, 22 సంవత్సరాలు, పద్మశాలి కుటుంబం గత నాలుగు ఐదు రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చనిపోవడం జరిగింది. ఈయన తండ్రి ఇంతకుముందే చనిపోయాడు. ఇతనిది కడుపేదరిక కుటుంబము తల్లి ఉన్నది. దహన సంస్కారాలు చేయలేని స్థితిలో తల్లి ఉన్న విషయం, గుర్తించి సైదాపూర్ మండలంలో ఎస్సైగా పనిచేస్తున్న జన్ను ఆరోగ్యం వెంటనే స్పందించి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మానవతా దృక్పథంతో దహన సంస్కరణలకు ఐదువేల రూపాయలు అందజేసి మరీ దగ్గర ఉండి అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాడు. దీనికి పలు సామాజిక మాధ్యమాల్లో పలువురు అభినందించారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి