ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరూరి.

 







గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్ పరిధిలోని సుబ్బయ్యపల్లి గ్రామానికి చెందిన పుట్ట రాహుల్ 94వేల రూపాయలు, రాజమణి 28వేల రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే గారు లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం అదే గ్రామానికి చెందిన కొక్కిరాల జయపాల్ రావు గారి కుమారి మౌనిక గారి ప్రథమ వర్ధంతికి హాజరై ఆమె చిత్ర పటానికి నివాళులు అర్పించారు. అనంతరం దేవన్నపేట గ్రామ మహిళా కమిటీ ఉపాధ్యక్షురాలు చుంచు రాధ సదానందం గారి మామ గారు చుంచు వెంకటయ్య గారు మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి వెంట డివిజన్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు