నేడు మెగా జాబ్ మేళా!!!:66 వ డివిజన్ నిరుద్యోగ యువతకు పాపి శెట్టి శ్రీధర్ పిలుపు


ఈరోజు HRS గార్డెన్స్, మామునూర్ 4వ బేటాలియన్ పక్కన, మామూనూరు వద్ద ఉదయం 09గంటల నుండి మ" 02:00గంటల వరకు ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వర్ధన్నపేట నియోజకవర్గం మరియు వరంగల్ జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువతి యువకుల కోసం మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది కావున 66వ డివిజన్ లో ఉన్న యువత  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు, ఈ జాబ్ మేళా లో 100కు పైగా కంపెనీలలో 1500లకు పైగా ఉద్యోగ అవకాశాలతో ఏర్పాటు చేస్తున్న ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోగలరు. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తప్పకుండ మీ యొక్క రెజ్యుమ్, పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోతో పాటు విద్యార్హత సర్టిఫికెట్లు తీసుకురావాలి. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులందరికి భోజన కూడా ఏర్పాటు చేయడం జరిగిం దని కావున నిరుద్యోగ యువతి, యువకులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోగలర ని కోరుతూ గ్రేటర్ వరంగల్ 66 వ డివిజన్ అద్యక్షుడు శ్రీ పాపిశెట్టీ శ్రీధర్ గారు 66 వ డివిజన్ నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు ..

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు