మామునూర్ 4వ బేటాలియన్ స్కూల్ పరిపాలన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి
గ్రేటర్ వరంగల్ 43వ డివిజన్ పరిధిలోని మామునూర్ 4వ బేటాలియన్ లోని కృష్ణవేణి విద్యాసంస్థ ల సహకారం తో నిర్వహిస్తున్న ఇంగ్లిష్ మీడియం హై స్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన పరిపాలన భవనాన్ని (అడ్మిన్ బ్లాక్) ను నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారితో కలిసి ప్రారంభించిన తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థకు అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు. కార్పొరేట్ స్తాయిలో బేటాలియన్ పాఠశాలను తీర్చిదిద్దిన కామాండెట్ గారికి అభినందనలు తెలిపారు. బేటాలియన్ లో ఇప్పటికే 2కోట్లతో గ్రౌండ్ నిర్మాణం చేపట్టినట్లు, త్వరలోనే 80లక్షలతో బిటీ రోడ్డు పనులను కూడా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. బేటాలియన్ అభివృద్ధికి అన్ని రకాల పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బేటాలియన్ కామాండెట్ శివ ప్రసాద్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఈదురు అరుణ విక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు, స్థానిక నాయకులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి