మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే అరూరి....

 







హాసన్ పర్తి మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన ముచ్చు చేరాలు గారు మరణించడంతో వారి మృతదేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరమర్శించిన తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు. అనంతరం అదే గ్రామానికి నన్నెబోయిన ఐలమ్మ గారు ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీతానగరం గ్రామానికి చెందిన అల్లం కొమరల్లి గారు మరణించడంతో వారి మృతదేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు